పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడారు. మణిపూర్‌లో మహిళలపై జరుగుతున్న హింసను ప్రస్తావించిన డీఎంకే సభ్యులపై ఆమె తీవ్రంగా మండిపడ్డారు.ఈ సందర్భంగా దివంగత ముఖ్యమంత్రి జయలలితకు నిండు సభలో అవమానం జరిగిన విషయాన్ని ప్రస్తావించారు. తొలుత డీఎంకే ఎంపీ కనిమొళి సభలో మాట్లాడుతూ.. దేశంలో మహిళలపై నేరాలు పెరిగిపోతున్నాయని అన్నారు.