భారతదేశ విభజనకు కాంగ్రెస్ కారణమని, 1974లో కచ్చతీవు ద్వీపాన్ని శ్రీలంకకు ఇచ్చింది ఇందిరాగాంధీ ప్రభుత్వమేనని ప్రధాని నరేంద్ర మోదీ గురువారం అన్నారు. రామేశ్వరం (భారతదేశం) మరియు శ్రీలంక మధ్య ఉన్న ఈ ద్వీపాన్ని సాంప్రదాయకంగా శ్రీలంక మరియు భారతీయ మత్స్యకారులు ఉపయోగించారు. 1974లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ "ఇండో-శ్రీలంక సముద్ర ఒప్పందం" ప్రకారం కచ్చతీవును శ్రీలంక భూభాగంగా అంగీకరించారు. తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం కచ్చతీవును తిరిగి భారత్‌కు తీసుకురావాలని కోరుతూ తనకు లేఖలు రాస్తోందని ప్రధాని అన్నారు. కచ్చతీవు తమిళనాడు-శ్రీలంక మధ్య ఉన్న ద్వీపమని.. దాన్ని ఎవరో వేరే దేశానికి ఇచ్చారని.. అది ఇందిరాగాంధీ నాయకత్వంలో జరిగిందని ఆయన అన్నారు.