విశాఖ బహిరంగ సభలో పవన్ ప్రసంగమంతా అహంకారం, విద్వేషం, అసత్యాలతో కూడిన ఆరోపణలతో నిండిపోయిందని, వైయస్ జగన్పై అసూయ, ఆరాటం పవన్ కళ్యాణ్ మాటల్లో కనిపించిందని, తాను నమ్ముకున్న దత్తతండ్రి చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారనే భ్రమల్లో పవన్ బతుకుతున్నాడని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. పవన్ మాటల్లో తాను నాయకుడిగా ఎదగాలనే తాపత్రయం గానీ.. తనపార్టీ తాలూకూ భవిష్యత్తును కాపాడుకోవాలనే లక్ష్యం ఎక్కడా వినిపించడంలేదన్నారు. వారాహి పేరుతో ఒక లారీ ఎక్కి మూడోవిడత యాత్ర అంటూ పవన్కళ్యాణ్ ఊగిపోతూ ప్రసంగిస్తున్నాడని, లక్ష్యం, సిద్ధాంతం, వ్యక్తిత్వం లేని వ్యక్తి అసత్య ఆరోపణలతో ఆవేశపడి ఊగిపోయినంత మాత్రానా నాయకుడు కాలేడనేది పవన్ తెలుసుకోవాలని సూచించారు. ఒక కథానాయకుడిగా సినిమాల్లో ఏ వేషాలైనా వేసి తాను కలలుగనే లక్ష్యాన్ని చేరుకోవచ్చు.. అంతేగానీ ప్రజాక్షేత్రంలో పోరాడి ప్రజలు మెచ్చిన నేతగా ఉన్న సీఎం వైయస్ జగన్ని ఓడించాలనుకోవడం సాధ్యం కాని విషయమని అర్థం చేసుకోవాలన్నారు.