వివేక హత్య కేసులో మాజీ ఐఏఎస్ అజేయ కల్లం పిటిషన్ విచారణ అర్హతపై తీర్పును తెలంగాణ హైకోర్టు రిజర్వు చేసింది. 161 సీఆర్పీసీ కింద నోటీస్ ఇవ్వలేదని అజయ్ కల్లం తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. తనకు సీబీఐ అధికారులు మెసేస్ చేసి విచారణకు పిలిచారని, తన స్టేట్ మెంట్ రికార్డు చేసింది వికాస్ సింగ్ అని.. అయితే స్టేట్‌మెంట్‌పై సంతకం ముఖేష్ శర్మ ది ఉందని కోర్టుకు తెలిపారు. సీబీఐ చార్జిషీటులో తన స్టేట్‌మెంట్ తొలగించి.. తిరిగి రికార్డు చేయాలని అజేయ్ కల్లం తరఫు న్యాయవాదవులు వాదించారు. దీంతో వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది.