జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో పర్యటిస్తున్నారు. సుజాత నగర్లో మాజీ వాలంటీర్ వెంకటేష్ చేతుల్లో హత్యకు గురైన వృద్ధురాలు కోటగిరి వరలక్ష్మి కుటుంబ సభ్యులను పవన్ పరామర్శించారు. వరలక్ష్మి కుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉంటుందని ఆయన చెప్పారు. వాలంటీర్లను తీసుకునేటప్పడు పోలీస్ వెరిఫికేషన్ చేయాలని డిమాండ్ చేశారు.