ఆధార్ కార్డు పేరిట ఎన్ని సిమ్‌కార్డులు ఉన్నాయో తెలుసుకునేలా డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికాం ఒక వెబ్‌సైట్‌ను రూపొందించింది. దీనికోసం తొలుత tafcop.dgtelecom.gov.in వెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వాలి. అందులో ‘బ్లాక్ యువర్ లాస్ట్/ స్టోలెన్ మొబైల్’, ‘నో యువర్ మొబైల్ కనెక్షన్’ అనే రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. రెండో ట్యాబ్‌పై క్లిక్ చేస్తే మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయాలని అడుగుతుంది. ఆ తర్వాత మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేస్తే ఆ యూజర్ పేరిట ఉన్న మొబైల్ నంబర్ల జాబితా చూపిస్తుంది.