జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పై ఏపీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు, పవన్‌కల్యాణే దండుపాళ్యం బ్యాచ్ అని, పవన్ జ్ఞానం వచ్చే పుస్తకాలు చదివుంటే బాగుండేదని విమర్శించారు. రుషికొండలో నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్ ఎగురవేశారని, దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.