ఏపీ కృష్ణా జిల్లా మచిలీపట్నంలో సంచలనం సృష్టించిన డాక్టర్ రాధ హత్య కేసులో నిందితుడైన ఆమె భర్త లోక్ నాథ్ మహేశ్వరరావు ప్రశ్నకు పోలీసులే నిర్ఘాంతపోయారు. తాను పకడ్బందీగా హత్య చేశానని, మీరెలా కనుక్కోగలిగారంటూ ఆయన వేసిన ప్రశ్నకు షాకయ్యారు. ఆస్తి కోసం జులై 25న వైద్యురాలిని ఆమె భర్త, డ్రైవర్ తో కలిసి హతమార్చాడు. పోలీసులు ఫోన్ కాల్స్ ఆధారంగా నిందితుల్ని గుర్తించారు. తాజాగా కోర్టు వీరికి 14 రోజుల రిమాండ్ విధించింది.