ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఐబీ(ఇంటర్నేషనల్ బాకలారియేట్) సిలబస్ ప్రవేశపెట్టేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా విద్యార్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్, సెల్ఫ్ లెర్నింగ్, క్రిటికల్ థింకింగ్ నేర్పించనున్నారు. ఫలితంగా విద్యార్థుల్లో ఒత్తిడిని తగ్గించే వీలుంటుంది. ఇప్పటికే పలు స్కూళ్లలో సీబీఎస్ఈ విధానం అమలు చేస్తున్న విషయం తెలిసిందే.