పోక్సో చట్టం (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్) క్రింద రెండు కేసులలో ఒక ముద్దాయికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ విజయనగరం పోక్సో కోర్టు తీర్పును ఇచ్చింది. నాలుగవ అదనపు సెషన్సు న్యాయమూర్తి, ఎస్. సి, ఎస్. టి చట్టం ట్రయల్ కేసుల సెషన్సు కోర్టు ప్రత్యేక న్యాయమూరి మరియు పోక్సో కోర్టు ఇన్ ఛార్జ్ న్యాయమూర్తి షేక్ సికిందర్ భాషా ఈ తీర్పును వెలువరించారు.