రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బహిరంగ లేఖ రాశారు. 2019లో జగన్ సీఎం అయ్యాక రాష్ట్ర పరిస్థితులను అందులో వివరించారు. ప్రతిపక్షాలపై అక్రమ కేసులు, ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. చిత్తూరు పర్యటనలో తనపై హత్యాయత్నం చేశారని, రాష్ట్రంలో తీవ్రమైన, అసాధారణ పరిస్థితులు ఉన్నాయని 9 పేజీల లేఖలో చెప్పుకొచ్చారు.