తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యువ సైకిల్ యాత్ర శాంతిపురం మండలం బండపల్లిలో కొనసాగుతోంది. ఆదివారం ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ సైకిల్ యాత్రలో పాల్గొన్నారు. యువకులతో కలిసి గ్రామాలలో సైకిల్ యాత్ర చేపడతూ చంద్రబాబు హయాంలో జరిగిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తున్నారు. చంద్రబాబుకు కుప్పంలో లక్ష ఓట్ల మెజారిటీయే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు కంచర్ల సూచించారు.