మణిపూర్లో జాతుల ఘర్షణలు చెలరేగి ఆదివారం నాటికి 102 రోజులు కావస్తోంది. అప్పటి నుంచి ఇంటర్నెట్ సేవలను కేంద్ర బీజేపీ ప్రభుత్వం నిలిపివేసింది. నేటికి వంద రోజులు దాటినా ఇంకా నిషేధం కొనసాగుతూనే ఉంది. అయితే ఇంటర్నెట్ సేవల పాక్షిక పునరుద్ధరణ కోసం హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని శనివారం ఆదేశించింది. కాగా ఈ ఏడాది మే 3న మణిపూర్లో అల్లర్ల నేపథ్యంలో ఇంటర్నెట్ సేవలను నిలిపిచేశారు.