వేటపాలెం మండలం రామాపురం వద్ద ఆదివారం సాయంత్రం సముద్రంలో కొట్టుకుపోతున్న కర్నూలు జిల్లాకు చెందిన పుల్లేటి మహేష్, గోగుల రమణ అనే ఇద్దరు యువకుల నిండు ప్రాణాలను మెరైన్ పోలీసులు కాపాడారు. సముద్రంలో స్నానం చేస్తుండగా అలల తాకిడికి వారు కొట్టుకుపోతుండడం గమనించి పోలీసులు గణేష్, వెంకటేశ్వర్లు సముద్రంలోకి వెళ్లి వారిని కాపాడి ఒడ్డుకు తెచ్చారు. ఎస్పీ జిందాల్ ఈ సందర్భంగా మెరైన్ పోలీసులను అభినందించారు.