ఇన్ స్టాలో ఎక్కువ మంది ఫాలోవర్లు కలిగి ఉందని ఓ వ్యక్తి తన భార్యను చంపిన దారుణ ఘటన యూపీలోని లఖ్నవూలో జరిగింది. నగరానికి చెందిన ఓ వ్యాపారవేత్త(37) భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. తన భార్యకు ఎక్కువ మంది ఫాలోవర్లు ఉండటం, అందులో తనను బ్లాక్ చేయడంతో భార్యకు ఎవరితోనో ఎఫైర్ ఉందని అనుమానం పెట్టుకున్నాడు. దీంతో ఆదివారం పిల్లలతో కలిసి కారులో వెళ్తుండగా, పిల్లల ముందే భార్యను గొంతు కోసి హత్య చేశాడు.