వాలంటీర్లకు పేపర్ కొనుగోలు కోసం నెలకు రూ.200 ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే వాటితో సాక్షి పత్రిక మాత్రమే కొంటున్నారని ఆరోపిస్తూ ఉషోదయ పబ్లికేషన్స్ సుప్రీం కోర్టును ఆశ్రయించగా. కేసును ఢిల్లీ హైకోర్టుకు సుప్రీంకోర్టు బదిలీ చేసింది. దీనిపై విచారించిన ఢిల్లీ హైకోర్టు వాలంటీర్లకు 200 ఇచ్చే విధానంపై పూర్తి వివరాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది.