గుంటూరు జిల్లాలో టీడీపీ యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర కొనసాగుతుంది. పలు ప్రాంతాల్లో ప్రజలు తమ సమస్యలను లోకేశ్‌కు విన్నవిస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని సమస్యలు తీరుస్తామని హామీ ఇస్తూ లోకేశ్ ముందుకు సాగుతున్నారు. ఈరోజు (సోమవారం) జిల్లాలోని తాడికొండ నియోజకవర్గంలో యవగళం పాదయాత్ర కొనసాగుతోంది. నేడు రావెల శివారు క్యాంప్ సైట్ నుంచి 184వ రోజు పాదయాత్రను యువనేత ప్రారంభించారు. మధ్యాహ్నం తాడికొండ శివారు విడిది కేంద్రం వద్ద ఆడిటర్లతో ముఖాముఖి సమావేశంలో లోకేశ్ పాల్గొంటారు. యువనేత ఇప్పటి వరకు 2453.2 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. ఈరోజు 11.3 కిలోమీటర్లు నడవనున్నారు.