ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమలలో గొంతు కోసుకున్న భక్తుడు,,,వెంటనే ఆస్పత్రికి తరలింపు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 15, 2023, 07:18 PM

తిరుమలలో ఓ వ్యక్తి గొంతు కోసుకోవడం కలకలంరేపింది. స్థానిక రింగ్ రోడ్డు దగ్గర ఈ ఘటన జరగ్గా.. రక్తపు మడుగులో ఉన్న వ్యక్తిని గమనించి భక్తులు 108కి సమాచారం అందించారు. వారు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని అశ్విని ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. గొంతు కోసుకున్న వ్యక్తిని కరీంనగర్‌కు చెందిన తులసిరామ్‌గా గుర్తించారు. మద్యానికి బానిసై ఇలా చేసుకున్నానని ఓసారి.. కుటుంబ కలహాలు కారణంగానే ఇలా చేసుకున్నట్లు మరోసారి అతడు సమాధానం ఇచ్చాడు బాధితుడు. అతడ్ని మెరుగైన వైద్యం కోసం తిరుపతి స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa