అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం కసాపురంలో వెలసిన నెట్టికంటి ఆంజనేయస్వామిని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.మన్మథరావు దర్శించుకున్నారు. మంగళవారం సాయంత్రం దేవస్థానానికి వచ్చిన న్యాయమూర్తి దంపతులను ఈఓ వెంకటేశ్వర రెడ్డి, అర్చకులు స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం వారికి తీర్థ ప్రసాదాలను, ఆశీర్వచనం అందజేశారు.