ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రగతి కోసం విజన్‌-2047

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 16, 2023, 10:11 AM

2047వ సంవత్సరం నాటికి దేశానికి స్వాతంత్య్రం వచ్చి వందేళ్లు అవుతుంది. ఏ వ్యూహాలు అనుసరిస్తే అప్పటికి దేశం ప్రపంచంలో అగ్రగామిగా నిలుస్తుందో వివరిస్తూ మొత్తం 52 పేజీలతో ఈ డాక్యుమెంటును టీడీపీ అధినేత చంద్రబాబు రూపొందించారు. ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన తొలిసారి విజన్‌-2020 తయారు చేయించి విడుదల చేశారు. రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర కోసం విజన్‌-2029 తయారు చేయించారు. ఆ అనుభవంతో ఇప్పుడు దేశం కోసం ‘భారత్‌-భారతీయులు-తెలుగువారు-విజన్‌-2047’ని రూపొందింపజేశారు. ఐదు ప్రధాన వ్యూహాలతో ముందుకెళ్తే మన దేశం ప్రపంచంలో అగ్రగామిగా నిలుస్తుందని చంద్రబాబు ఇందులో తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com