మన దేశంలో ఉన్న శాంతియుత వాతావరణం ప్రపంచంలోని ఏ దేశంలోనూ లేదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. విజయవాడలోని రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన స్వాతంత్య్ర దిన వేడుకల్లో పాల్గొన్న ఆమె జాతీయ జెండాను ఆవిష్కరించారు. మోదీ హయాంలో దేశం ఎంతో పురోభివృద్ధి సాధిస్తోందని, భావి తరాలను దృష్టిలో పెట్టుకుని చేపడుతున్న కార్యక్రమాల ద్వారా దేశం మరింత ప్రగతి సాధిస్తుందని ఆకాంక్షించారు.