నిన్న అనగా మంగళవారం విజయవాడలో జరిగిన 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆసక్తికర దృశ్యం ఒకటి చోటు చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం వైయస్ జగన్ పలువురు పోలీసు సిబ్బందికి పోలీస్ మెడల్స్ ప్రదానం చేశారు. ఈ క్రమంలో ఓ పోలీస్ అధికారికి మెడల్ కిందపడిపోయింది. అది గమనించకుండా ఆయన వెళ్లిపోసాగాడు. అయితే.. సీఎం వైయస్ జగన్ అది గమనించి ఆయన్ని ఆపారు. కిందకు దిగి ఆపి మరీ ఆ పోలీసుకు మెడల్‌ను తీసి మళ్లీ ఆ అధికారి గుండెలకు అంటించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.