పేదల ఆవసరాలు- ఆకాంక్షలు- ప్రగతి లక్ష్యంగా వీరి ఆకాంక్షల్ని – అవసరాల్ని– ప్రగతిని దృష్టిలో ఉంచుకుని, గత 50 నెలల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ స్వరాజ్యానికి అర్ధం తెచ్చిందని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. సామాజిక న్యాయం అన్నది కేవలం నినాదం కాదు... అది అమలు చేసే విధానం అని నిరూపిస్తూ... రాష్ట్ర మంత్రి మండలిలో ఏకంగా 68 శాతం పదవుల్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకే ఇచ్చామన్నారు. మంచి చేస్తున్నాం అనే భావన ఉంటేనే మళ్ళి గెలిపించండి అని తెలియజేసారు.