బైరెడ్డిపల్లి మండలంలోని ధర్మపురి పంచాయతీ వెంకటాపురంలో ఇరువర్గాల ఘర్షణలో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై వెంకయ్య తెలిపారు. గ్రామానికి చెందిన సరోజమ్మ, కృష్ణమూర్తి దంపతులకు మనోహర్, సుగుణమ్మలతో తాగునీటి కుళాయి విషయమై వివాదం ఏర్పడింది. ఈవివాదంలో మనోహర్, సుగుణమ్మలు సరోజమ్మ, ఆమె కుమారుడు శ్రీనివాసులు, మనవడు సంతోషన్ ను కొట్టి గాయపరిచారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు వారిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.