‘మోడీ’ ఇంటిపేరుపై వ్యాఖ్యలు చేశారన్న కేసులో లోక్సభ సభ్యత్వం కోల్పోయిన రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంతో ఆయన సభ్యత్వాన్ని పునరుద్ధరించారు. దీంతో ఇటీవల జరిగిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో పాల్గొన్నారు. కాగా తాజాగా రక్షణశాఖపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి రాహుల్ ఎంపికయ్యారు. మార్చి నెలలో సభ్యత్వం కోల్పోకముందు కూడా రాహుల్ ఈ కమిటీలోనే సభ్యుడిగా ఉన్నారు.