కాంట్రాక్టు ఉద్యోగుల క్రమ బద్ధీకరణకు సంబంధించి ఐదేళ్ల సర్వీసు నిబంధనను ఎత్తివేస్తూ తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల మేనిఫేస్టోలో ఇచ్చిన మాట ప్రకారం కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తూ గత మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇందుకు 2014 జూన్ 2వ తేదీ నాటికి ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న కాంట్రాక్టు ఉద్యోగులనే రెగ్యులరైజేషన్ చేసేలా నిబంధన విధించారు. తాజాగా సీఎం వైయస్ జగన్ ఐదేళ్ల నిబంధనను తొలగిస్తూ సంబంధిత ఫైలుకు మంగళవారం ఆమోద ముద్ర వేశారు. వీలైనంత ఎక్కువ మందిని రెగ్యులరైజ్ చేయాలనే ఉద్దేశంతో ఏ సంఘం డిమాండ్ చేయకుండానే స్వయంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఐదేళ్ల నిబంధనను తొలగిస్తూ నిర్ణయం తీసు కున్నారు. ఈ నిర్ణయంతో 2014 జూన్ 2వ తేదీకి ముందు నియమితులై ఇప్పటి వరకు కొన సా గుతున్న కాంట్రాక్టు ఉద్యోగులందరి సర్వీసును రెగ్యులరైజ్ చేయనున్నారు.