విజయనగరం జిల్లా, బొబ్బిలి గ్రోత్ సెంటర్లో ప్రభుత్వం మంత్రి బొత్స కుటుంబానికి భూ కేటాయింపు చేసిందని టీడీపీ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు కిమిడి నాగార్జున తెలిపారు. బొబ్బిలి పరిశ్రమల వాడలో మంత్రి బొత్స సోదరులకు చెందిన సత్యా బయో కెమికల్స్ కంపెనీకి 30 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించిందని కిమిడి నాగార్జున వెల్లడించారు. ఏపీఐఐసీ లెక్కల ప్రకారం ఎకరా 80 లక్షలకు పైగా విలువ చేసే భూమిని ఎకరా పది లక్షలకు కేటాయించడాన్ని ఖండిస్తున్నామన్నారు. బొత్స కుటుంబం కోసం ఇచ్చిన జీవో రద్దు చేయాలని కిమిడి నాగార్జున పేర్కొన్నారు.