బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన బండి సంజయ్ ఏపీ రాజకీయాల్లోకి అడుగుపెడుతూ ఈ నెల 21న విజయవాడలో పర్యటించనున్నారు. ఏపీలో ఓటరు నమోదు ప్రక్రియను బండి సంజయ్ సమీక్షించనున్నారు. బండి సంజయ్‌ను తెలంగాణ అధ్యక్షుడిగా మార్చిన తర్వాత బీజేపీ అధిష్టానం ఆయనకు జాతీయ ప్రధాన కార్యదర్శిగా పదోన్నతి కల్పించింది. ఈ నేపథ్యంలో బండి సేవలను తెలంగాణతోపాటు ఏపీలో కూడా ఉపయోగించుకోవాలని హైకమాండ్ నిర్ణయించింది. మొదటిసారిగా బండి సంజయ్ ఏపీకి వెళుతున్న నేపథ్యంలో రాజకీయంగా ఆసక్తి నెలకొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa