టీడీపీ యువనేత నారా లోకేశ్ ఈరోజు (శుక్రవారం) మంగళగిరి కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. పోసాని తప్పుడు ఆరోపణలపై పరువు నష్టం కేసు దాఖలు చేశారు. అలాగే సింగలూరు శాంతి ప్రసాద్పైనా లోకేశ్ పరువు నష్టం కేసు వేశారు. ఈ రెండు కేసులపై కోర్టులో నారా లోకేశ్ వాంగ్మూలం ఇచ్చారు. అనంతరం యువనేత మీడియాతో మాట్లాడుతూ.. తనపై, తన కుటుంబంపై అనేక ఆరోపణలు చేశారన్నారు. ఆరోపణలు నిరూపించాల్సిన బాధ్యత వైసీపీదే అని చెప్పారు. ఓ నియంతపై తాను పోరాడుతున్నానని.. ఓ పెత్తందారు, వైసీపీ గ్లోబల్ ప్రచారంపై పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. న్యాయం కోసమే కోర్టును ఆశ్రయించినట్లు చెప్పారు.