తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పర్యటన కోనసీమ జిల్లా, అమలాపురంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ..... వైద్య విద్యను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని తెలియజేసారు. ఇన్సూరెన్స్ చేయించి ప్రతీ ఒక్కరికీ లక్ష రూపాయలు వరకు వైద్య సదుపాయం కల్పిస్తామన్నారు. డాక్టర్లు, ఉపాధ్యాయులు, న్యాయమూర్తులు మంచిని ప్రోత్సాహించాలని, రాజకీయాల్లో విలువలు లేవని, వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వ్యవస్థలను నాశనం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.