ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగులకు సంబంధించి ఇబ్బందికరంగా ఉన్న ఐదేళ్ల నిబంధనను తొలగించి 2014 జూన్ 2వ తేదీకి ముందు పనిచేసిన అందరినీ రెగ్యులర్ చేయాలని సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయానికి కాంట్రాక్టు లెక్చరర్లు హర్షం వ్యక్తంచేశారు. తాడేపల్లిలో జేఏసీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం నిర్వహించారు. సీఎం వైయస్ జగన్ నిర్ణయంతో విద్యాశాఖలో జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లు ఎక్కువమందికి లబ్ధి చేకూరిందన్నారు.