చంద్రబాబు మాట్లాడుతున్న అంశాలు చూస్తే ఆయన రాష్ట్రానికి అవసరమా అనిపిస్తోందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. విశాఖలో క్రైమ్ రేట్ పెరగలేదు చంద్రబాబు హయాం కంటే బాగా తగ్గింది....తెలుగుదేశం పార్టీ హయాంలో శాంతిభద్రతలు క్షీణించాయి... దివంగత నేత వైయస్ఆర్ హయాంలో విశాఖ ఏ విధంగా అయితే ప్రశాంతంగా ఉందో నేడు అదే విధంగా ఉంది అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. పవన్ కల్యాణ్, చంద్రబాబులు కావాలని విశాఖపై శాంతిభధ్రతలు క్షీణించాయంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. శుక్రవారం సాయంత్రం తాడేపల్లిలో మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. విశాఖ రాజధానిగా వైయస్ జగన్ ,ప్రభుత్వం అక్కడకు మూవ్ అవుతుందని తెలిసినప్పటినుంచి చంద్రబాబు,పవన్ కల్యాణ్ లు ఒకరితర్వాత ఒకరు అక్కడకు వెళ్లి కూర్చుని అక్కడి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. అక్కడ ఏదో ఘోరాలు జరగబోతున్నాయని ప్రచారం చేయాలని చేస్తున్నారు.2014లో సైతం చంద్రబాబు ఇలానే చేశారు. చంద్రబాబు హయాంలో ఘోరాలు జరగాయి వాటిని సరిచేసే పనిలో వైయస్ జగన్ ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు, పవన్ కల్యాణ్ వెళ్ళి మాట్లాడుతున్న విధానం చూస్తే విశాఖకు రాజధాని రాకూడదనేది వారి కోరిక. అక్కడి ప్రజలను టెర్రరైజ్ చేస్తున్నారు.పవన్ ప్రతిరోజు గుట్టలు,కొండలు దగ్గరకు వెళ్తూ అక్కడేదో జరిగిందని యాగి చేస్తున్నారు. ఇసుక దిబ్బలు దగ్గరకు వెళ్తున్నారు ప్రపంచంలోని పర్యావరణ రక్షణ అంతా తానే చేస్తున్నట్లు ప్రకటనలు చేస్తున్నారు.వైయస్ఆర్‌సీపీ, వైయస్ జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా అది అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ది చేసేదిగా ఉంటుంది అని అన్నారు.