రాష్ట్రాన్ని ప్రజారంజకంగా పాలించకుండా రూ.వేల కోట్ల ప్రజాధనాన్ని జగన్ లూటీ చేశాడు. రూ.లక్ష కోట్ల మేరకు అవినీతి సొమ్మును పోగేశాడు. అందుకే వచ్చే ఎన్నికల్లో ఆయన్ను గద్దె దింపేయాలని నిర్ణయించుకున్నా’’ అని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ స్పష్టం చేశారు. విశాఖ జిల్లాలో ఈ నెల 10న ప్రారంభించిన వారాహి యాత్ర శుక్రవారంతో ముగిసింది. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.... ఉత్తరాంధ్రలో వైసీపీ నేతలు ఇప్పటివరకు సుమారు 30 వేల ఎకరాలు సొంతం చేసుకున్నారని, వాటిని అభివృద్ధి చేసుకోవడానికి, పెట్టుబడులు రప్పించుకోవడం కోసమే విశాఖను పాలనా రాజధానిగా ప్రకటించారని విమర్శించారు. ఒక్క రాజధానినే నిర్మించలేని ఈ ప్రభుత్వం మూడు రాజధానులు ఎలా నిర్మిస్తుందని ప్రశ్నించారు.