విజయవాడ డివిజన్లో భద్రతా నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఈనెల 21 నుంచి 27వ తేదీ వరకు కాకినాడ- విశాఖ (17247), విశాఖ- కాకినాడ (17268), రాజమండ్రి- విశాఖ (07466), విశాఖ- రాజమండ్రి (07467) పాసింజర్ రైళ్లను రద్దు చేసినట్టు సీనియర్ డీసీఎం ఏకే.త్రిపాఠి తెలిపారు. అలానే ఈనెల 21, 22వ తేదీల్లో ఎర్నాకులం-పాట్నా ఎక్స్ప్రెస్ (22643), ఈనెల 23, 24 తేదీల్లో బెంగళూరు-గుహవటి ఎక్స్ప్రెస్ (12509), 27న కొయంబత్తూర్-సిలిచర్ ఎక్స్ప్రెస్(12515) రైళ్లు వయా నిడదోవలు, భీమవరం టౌన్, గుడివాడ, విజయవాడ మీదుగా మళ్లింపు మార్గంలో నడుస్తాయని పేర్కొన్నారు.