వైసీపీ అధికారంలోకి వచ్చాక, సీఎం జగన్ రాష్ట్రాన్ని గంజాయి ప్రదేశ్‌గా మార్చాడని టీడీపీ అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ వాపోయారు. రాష్ట్రంలో ఏ నేరం జరిగినా దాని వెనక గంజా దాగివుందని వ్యాఖ్యానించారు. ఇటీవల కృష్ణా జిల్లా పెనమలూరులో షేక్ రఫీ అనే ముస్లిం యువకుడు నమాజ్‌కు వెళ్తుండగా, గంజాయి మత్తులో జోగుతున్న ముఠా హత్య చేసిందని చెప్పారు. మృతుని కుటుంబానికి రూ.25లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు.