రాష్ట్రంలో 18 ఏళ్లలోపు బాల బాలికలకు వివాహాలు జరిగితే, అలాంటి కుటుంబాలకు ప్రభుత్వ పథకాలు ఏమీ వర్తించవని ప్రజల్లో అవగాహన కల్పించాలని సీఎస్ జవహర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం అమరావతి సచివాలయంలో వివిధ శాఖల అధికారులతో సీఎస్ సమీక్షించారు. ‘‘నూతన నిబంధనల ప్రకారం వివిధ స్థాయిల్లో చైల్డ్ మ్యారేజెస్ ప్రొహిబిషన్ అధికారులను(సీఎంపీఓలు) నియమించి వారికి కచ్చితమైన విధులు, అధికారాలను ఇవ్వనున్నాం. బాల్య వివాహాలను నియంత్రించడంలో విఫలమైతే వారిపై చర్యలు తీసుకుంటాం. గ్రామ, వార్డు సచివాలయ స్థాయిలో ఉన్న అధికారులు ప్రజలలో చైతన్యం తీసుకురావాలని తెలిపారు.