శ్రీరామ్ రెడ్డి తాగునీటి పథకం కార్మికులు అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగారు. వేతనాలు, పెండింగ్ బకాయిలు, సమాన పనికి సమాన వేతనాలు అందజేయాలంటూ కార్మికులు నిరసన చేపట్టారు. తాగునీటిని సరఫరా చేసే పంపులు బంద్ చేయడంతో కళ్యాణదుర్గం, రాయదుర్గం, హిందూపురం, మడకశిర నియోజకవర్గాలలోని 850 గ్రామాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. గత ఆరు నెలలుగా వేతనాలు చెల్లించలేదంటున్న కార్మికులు ఎన్నిసార్లు చెప్పినప్పటికీ, ఆందోళనలు చేసినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదని కార్మికులు చెబుతున్నారు. తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చేంత వరకు ఆందోళన విరమించేది లేదని కార్మికులు స్పష్టం చేశారు. కార్మికుల ఆందోళనతో 850 గ్రామాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది.