ప్రకాశం జిల్లా, ముండ్లమూరు సబ్‌స్టేషన్‌ను ఏపీ సీపీడీసీఎల్ టెక్నికల్ డైరెక్టర్ విజయవాడ జయభారతరావు సందర్శించారు. సబ్‌స్టేషన్ అపరిశుభ్రంగా ఉండటంతో సిబ్బందిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వారం రోజుల్లోగా పరిశుభ్రంగా ఉంచి తమకు తెలియజేయాలని ట్రాన్స్‌కో ఇన్చార్జి ఏఈ ఇమానియేల్ బాబును ఆదేశించారు. విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించడంతో పాటు మెరుగైన సేవలందించేందుకు కిందిస్థాయి సిబ్బంది పనిచేయాలని తెలియజేసారు. సబ్ స్టేషన్లో పిచ్చి మొక్కలు మొలవడంతో పాటు ఫీడర్స్కు పాతదుస్తులు కట్టడాన్ని చూసి సంబంధిత సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.