ఓటర్ల సమగ్ర సర్వే పారదర్శకంగా నిర్వహించాలని రేపల్లె తహసిల్దార్ మల్లికార్జునరావు బిఎల్ఓ లను ఆదేశించారు. శనివారం రేపల్లె రూరల్ మండలం నల్లూరు, చాట్రగడ్డ, కామరాజు గడ్డ, చోడాయిపాలెం, పిరాట్లంక, చెన్నుపల్లి వారిపాలెం, విశ్వేశ్వరం, సింగుపాలెం గ్రామాల్లో జరుగుతున్న ఓటర్ల సమగ్ర సర్వేను ఆయన పరిశీలించారు. డోర్ టు డోర్ వెరిఫికేషన్ పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. బిఎల్వోలు, విఆర్వోలు, సిబ్బంది పాల్గొన్నారు.