దేశీయంగా ధరలను అదుపు చేసేందుకు కేంద్రం బియ్యం ఎగుమతులపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఉల్లి విషయంలోనూ దాదాపు ఇదే నిర్ణయం తీసుకున్నారు. ఉల్లి ధరలను నియంత్రించేందుకు, దేశీయంగా సరఫరాను పెంచేందుకు ఎగుమతులపై 40 శాతం సుంకం విధించారు. డిసెంబర్ 31 వరకు ఈ పన్ను అమల్లో ఉంటుందని పేర్కొంది. తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.