అద్దంకి మండలం సింగరకొండ పాలెం గ్రామంలో శనివారం సాయంత్రం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని రెండోవ రోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అద్దంకి వైసిపి ఇన్చార్జ్ బాచిన కృష్ణ చైతన్య పాల్గొని ఇంటింటికి తిరిగి రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు అందించిన సంక్షేమ పథకాలను వివరించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమస్యల పరిష్కారం కోసమే గడపగడపకు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని కృష్ణ చైతన్య తెలిపారు.