అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు వద్ద ఆర్టీసీ బస్సు లోయలో పడిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ఈ ప్రమాదంపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని స్పష్టం చేశారు. ప్రమాదానికి దారితీసిన కారణాలపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు.