ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీకి వాతావరణశాఖ వర్ష సూచన,,,తేలికపాటి నుంచి మోస్తరు వానలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 21, 2023, 06:46 PM

ఏపీలో రెండ్రోజులుగా పడుతున్న వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టాయి. బంగళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన రెండ్రోజులు మాత్రమే ప్రభావం చూపింది. ఆదివారం నుంచి వానలు కాస్త తగ్గుముఖం పట్టాయి. అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడ్డారు. నైరుతి రుతుపవనాలు బలహీనంగా ఉండడంతో నెలాఖరు వరకు దక్షిణ, మధ్యభారతంలో వర్షాలు తక్కువగానే ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఈ నెల 24వ తేదీతో ముగియనున్న కాలం వరకు మధ్య భారతంలో ఎక్కువచోట్ల వర్షాలు కురిసినా దక్షిణాదిలో మాత్రం అక్కడక్కడా కురుస్తాయంటున్నారు.


ఈ నెల 7 నుంచి 18 వరకు రుతుపవన ద్రోణి ఉత్తరాది/ హిమాలయాల్లో కొనసాగింది. ఈ సమయంలో దేశంలో రుతుపవన విరామం ఏర్పడిందని నిపుణులు అంటున్నారు. ఈ శతాబ్దంలో 2002, 2009 తర్వాత ఈ ఏడాదే ఎక్కువ రోజులు రుతుపవన విరామం కొనసాగింది అంటున్నారు. గతంలో 1972, 1979 మాత్రమే రుతుపవన విరామం కనిపించింది అన్నారు. రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఎండలు కొనసాగాయి. కొన్ని జిల్లాలు మినహా ఆదివారం పొడివాతావరణం కనిపించింది. కావలిలో 38.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా ఉరుములు, పిడుగులతో వర్షాలు కురుస్తాయని, అదే సమయంలో ఎండ తీవ్రత కొనసాగుంది అంటోంది వాతావరణశాఖ.


మరోవైపు ఆదివారం చూస్తే.. కోస్తా ప్రాంతంలోని నెల్లూరు జిల్లా సీతారామపురంలో 16.4 మిల్లీ మీటర్లు, కృష్ణా జిల్లా గుడివాడలో 12.6, పశ్చిమగోదావరి జిల్లా తణుకులో 10.8, నెల్లూరు జిల్లా ఉదయగిరిలో 10, పార్వతీపురం మన్యం జిల్లా బాలాజీపేటలో 10 సెంటీమీర్ల వర్షపాతం నమోదైంది. రాయలసీమ ప్రాంతంలోని శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్లలో 33.2 సెంటీమీటర్లు, తిరుపతి జిల్లా తడలో 29.8, తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో 29.6, చిత్తూరు జిల్లా పుంగనూరులో 24.2, కడప జిల్లా పోరుమామిళ్లలో 20, శ్రీ సత్యసాయి జిల్లా అమడగూరులో 17.2, కడప జిల్లా రాజుపాలెంలో 15.6, శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో 15, అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రంలో 14.2, శ్రీ సత్యసాయి జిల్లా నల్లమడలో 12.2, తిరుపతి జిల్లా తొట్టెంబేడులో 11.2, తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో 10.4, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.


మరోవైపు తెలంగాణలో రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం కూడా అక్కడక్కడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు మరో రెండు రోజులు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం పడింది. మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు వానలు పడ్డాయి. ఆదిలాబాద్‌, కుమురం భీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కరీంగర్, కామారెడ్డి, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్, మెదక్, సంగారెడ్డి, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వానలకు అవకాశం ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa