పంజాబ్లో వరద బాధిత రైతు కుటుంబాలకు పరిహారం అందకపోవడాన్ని నిరసిస్తూ ఆగస్టు 22 నుంచి రైతు సంఘాలు నిరసన ప్రదర్శనకు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ ఆధ్వర్యంలో దాదాపు 16 సంఘాల నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారిలో కెఎంఎస్సి రాష్ట్ర అధ్యక్షుడు సర్వన్ సింగ్ పాండర్, ప్రెస్ సెక్రటరీ బల్దీప్ సింగ్ తదితరులు ఉన్నారు.