భట్టిప్రోలు మండల పరిధిలోని వెల్లటూరు గ్రామంలో 6 సం. ల చిన్నారిపై అత్యాచారం చేసిన దోషికి సత్వరమే పాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారించి కఠినమైన శిక్ష వేయాలని సిపిఎం పార్టీ బృందం మంగళవారం డిమాండ్ చేశారు. సిపిఎం పార్టీ బృందం బాధితురాలు స్వగృహంకు వెళ్లి కుటుంబాన్ని పరామర్శించారు. కార్యక్రమంలో టి. కృష్ణమోహన్, జి సుధాకర్, ఎం. సత్యనారాయణ, జి నాగరాజు, వేములపల్లి వెంకటరామయ్య, కె. రామస్వామి, ఏసుబాబు పాల్గొన్నారు.