ఊహించని పరిస్థితుల్లో లిబియాకు వెళ్లి ఆరు నెలల అనంతరం భారత్కి చేరిన ఇద్దరు హరియాణ యువకులు వారి చేదు అనుభవాలను మీడియా ముందు వెళ్లగక్కారు. "ఓ ఏజెంట్ ఇటలీ పంపిస్తామని చెప్పి రూ. 13 లక్షలు తీసుకుని లిబియాకు పంపించాడు. అక్కడ ఏవో ఆరోపణలతో తమను జైలుకు పంపించారు. లిబియా జైలులో రెండుమూడు రోజుల పాటు ఎటువంటి ఆహారం ఇచ్చేవారు కాదు. తాము చనిపోకుండా ఉండేందుకు టాయిలెట్ నీటిని అందించేవారు" అని ఆ యువకులు చెప్పారు.