వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను చంపించింది ఓ భార్య. ఈ ఘటన అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం కొత్తమల్లంపేటలో చోటు చేసుకుంది. అప్పలనాయుడు(33), జానకి(24) భార్యాభర్తలు. కాగా తాపీమేస్త్రి అయిన చింతల రాము(34)తో జానకికి వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ క్రమంలో భర్తను తొలగించుకోవాలని భావించిన జానకి.. భర్తను నమ్మించి గుడికి తీసుకెళ్లింది. తిరుగు ప్రయాణంలో ప్రియుడితో చంపించింది.