తిరుమల మెట్ల మార్గంలో మరో చిరుత కనిపించింది. అధికారులు ఆ మార్గంలో 400 ట్రాప్ కెమెరాలు అమర్చగా. చాలా చోట్ల బోన్లను ఏర్పాటు చేశారు. ఈ బోనుల్లో ఇప్పటికే 2 చిరుతలు చిక్కుకున్నాయి. అయితే ఆగస్టు 22 అర్ధరాత్రి 7వ మైలు దగ్గర మరో చిరుత కదలికను అధికారులు గుర్తించారు. చిరుతకు సంబంధించిన దృశ్యాలు కెమెరాలో రికార్డయ్యాయి. కెమెరాకు సమీపంలోనే బోను ఏర్పాటు చేసినా చిరుత చిక్కలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa