కృష్ణా ఎక్స్ప్రెస్ రైలులో శుక్రవారం ఉదయం పొగలు వచ్చాయి. తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న రైల్లో ఏసీ బోగీ చక్రాల నుంచి పొగలు రావడాన్ని గుర్తించిన ప్రయాణికులు గమనించారు. తిరుపతి జిల్లా వెంకటగిరి ఎల్లకారు మధ్య చైన్ లాగి రైలును నిలిపివేశారు. రైల్వే కోపైలట్, సిబ్బంది ఏసీ బోగీ వద్దకు వచ్చి పరిశీలించారు. బ్రేకులు పట్టేయడంతో పొగలు వచ్చినట్లు వారు తెలిపారు. ఈ ఘటనతో దాదాపు 20 నిమిషాలపాటు రైలు నిలిచిపోయింది. అనంతరం మరమ్మతులు చేపట్టడంతో కృష్ణా ఎక్స్ప్రెస్ యథావిధిగా బయల్దేరింది. ప్రయాణికులు సకాలంలో పొగలు రావడాన్ని గుర్తించడంతో చక్రాల నుంచి మంటలు వ్యాపించకముందే ప్రమాదం తప్పింది. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.