గన్నవరం వైసీపీ నేత దుట్టా రామచంద్రరావుతో మచిలీపట్నం ఎంపీ బాలశౌరి భేటీ అయ్యారు. ఈ రోజు మధ్యాహ్నం హనుమాన్ జంక్షన్ దుట్టా నివాసంలో భేటీ ఐనట్లు సమాచారం. మొత్తానికి గన్నవరంలో రాజకీయాలు రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతున్నాయి. టీడీపీ నుంచి గెలిచి వల్లభనేని వంశీ వైసీపీలోకి వచ్చినప్పటి నుంచి దుట్టా పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే తాజాగా యార్లగడ్డ వెంకట్రావు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. దీంతో వైసీపీకి బలం తగ్గింది. పైగా ఇటీవల జరిగిన పంచాయతీ ఉపఎన్నికల్లో టీడీపీ విజయం సాధించి వైసీపీకి షాక్ ఇచ్చింది. దీంతో గన్నవరం టీడీపీదేనన్న సంకేతాలు జనాల్లోకి వెళ్లిపోయాయి. ఈ నేపథ్యంలో దుట్టాను తిరిగి యాక్టివ్ పొలిటిక్స్‌లోకి తీసుకొచ్చేందుకు వైసీపీ పావులు కదుపుతోంది. అయితే యార్లగడ్డ మాత్రం దుట్టా తమకే అనుకూలంగా వ్యవహరిస్తారని చెపుతున్నారు.